గాంజా శంకర్గా సుప్రీం హీరో.. మాస్ అవతార్లో రచ్చ షురూ

గాంజా శంకర్గా సుప్రీం హీరో.. మాస్ అవతార్లో రచ్చ షురూ

సుప్రీమ్ హీరోగా సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) తన తరువాతి సినిమాను ప్రకటించారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది(Sampath nandi) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా అక్టోబర్ 15 సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

Also Read :- మార్టిన్ లూథర్ కింగ్ మూవీలో సంపూర్ణేష్ బాబు ఓటే కీలకం

సాయి ధరమ్ తేజ్ కెరీర్ 17వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టు కు గాంజా శంకర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. టీజర్ చాలా మాసీగా ఉంది. సాయి ధరమ్ కూడా ఇప్పటివరకు ఎన్నడూ కనిపించనంత మాస్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. దీంతో సాయి ధరమ్ కెరీర్ లో మరో హిట్టు కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరి విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సాయి ధరమ్ నుండి వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.