బోథ్ ఎమ్మెల్యే కు తప్పిన ప్రమాదం

బోథ్ ఎమ్మెల్యే కు తప్పిన ప్రమాదం

నేరడిగొండ , వెలుగు: బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ప్రయాణిస్తున్న కారు శనివారం  ప్రమాదానికి గురైంది.  మండలంలోని కొరిటికల్ కార్నర్ వద్ద జాతీయ రహదారి పై కారు ఆవును ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది . నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తున్న  క్రమంలో ఈ ఘటన జరిగింది. 

ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ఎమ్మెల్యే చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను బోథ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు  భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు .