రేషన్ డీలర్ల సమ్మె విరమణ

రేషన్ డీలర్ల సమ్మె విరమణ

హైదరాబాద్‌‌, వెలుగు: తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మెను రేషన్‌‌ డీలర్లు విరమించారు. మంత్రి గంగుల కమలాకర్‌‌ హామీతో సమ్మె విరమిస్తున్నామని తెలిపారు. వెంటనే రేషన్‌‌ పంపిణీని కూడా ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. మంగళవారం సెక్రటేరియెట్‌‌లో మంత్రి గంగుల, రేషన్ డీలర్ల జేఏసీ చైర్మన్ నాయికోటి రాజుతో పాటు ఇతర నేతలతో చర్చించారు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. 2.83 కోట్ల మంది పేద ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని, ఏ ఒక్కరూ ఆకలితో ఉండొద్దనే దానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కమిషన్ పెంపు ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గంగుల స్పష్టమైన హామీ ఇవ్వడంతో రేషన్ డీలర్ల జేఏసీ నేతలు సమ్మెను విరమించారు.