
- నర్సాపూర్ గురుకులంలో ఘటన
- ఎవరికీ చెప్పొద్దని టీచర్లు భయపెట్టారన్న పేరెంట్స్
నర్సాపూర్, వెలుగు: మెదక్‌జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులను ఎలుకలు కరిచాయి. 6వ తరగతి చదువుతున్న చిలప్‌చెడ్ మండలం గౌతాపూర్‌కు చెందిన కిరణ్ కుమార్, హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్, వికారాబాద్‌కు చెందిన విశాల్.. ఆదివారం రాత్రి తమ రూంలో నిద్రపోగా.. ముగ్గురినీ ఎలుకలు కరిచాయి. సోమవారం కిరణ్‌కుమార్ తన తండ్రి రాజుకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో రాజు రాత్రి వరకు స్కూల్‌కు వచ్చి కిరణ్‌కుమార్‌ను నర్సాపూర్ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు.
విశాల్, ప్రశాంత్కూడా తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ముగ్గురు స్టూడెంట్స్‌ను ఎలుకలు కరిచాయని తెలుసుకున్న మిగతా విద్యార్థులు భయపడుతున్నారు. కాగా, ఎలుకలు కరిచిన విషయాన్ని బయట ఎవరికీ చెప్పొద్దని టీచర్లు, ప్రిన్సిపాల్ స్టూడెంట్స్నుభయపెడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు.