
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. అసలు పార్టీ ఎలా జరిగింది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయ్.. ఎలా వచ్చాయ్ మిమల్ని పిలిచింది ఎవరూ..దీని వెనక ఉన్నది ఎవరూ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేవ్ పార్టీ కేసు విచారణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో హేమతో పాటు పలువురికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. వీరందరూ ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలోనే దర్యాప్తుకు తాను హాజరుకాలేనని తెలుగు సినీ నటి హేమ లేఖ విడుదల చేశారు. బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాసి తాను రాలేకపోతున్నానని చెప్పారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు లేఖ తెలిపారు హేమ.
సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరింది. ఇదిలా ఉండగానే హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది సీసీబీ.మరోవైపు తాను ఆ పార్టీకే వెళ్లలేదని తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన హేమ.. తన బ్లడ్ సంపుల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో కేసులో మరింత ఇరుక్కున్నట్టు అయ్యింది.