వసాయ్ యువతి హత్యపై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్

వసాయ్ యువతి హత్యపై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్

ముంబైలోని వసాయ్ లో జరిగిన యువతి హత్యపై బాలీవుడ్ యాక్టర్ రవీనా టాండన్ X వేదికగా స్పందించారు. జూన్ 18న చించపాడ ప్రాంతంలో ఉదయాన్నే నడి రోడ్డు మీద 29ఏళ్ల యువకుడు యువతిని పాణ(స్పానర్)తో కొట్టి చంపాడు. ఆ ఘటన జరుగుతున్నప్పుడు రోడ్డు మీద ఉన్న ఎవరు అతన్ని ఆపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం తెలియగానే తన రక్తం మరిగిపోయిందని రవీనా టాండన్ అన్నారు.  

అక్కడ ఉన్నవారందరూ యువతిని ఎందుకు రక్షించలేదని ఆమె ఎక్స్ ఎకౌంట్ ద్వారా ప్రశ్నించింది. స్పానర్ తో యువతి చాతి, తలపై కొడుతుంటే కాపడటానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదని ఆమె రాసింది. అతని దగ్గర పదునైనా ఆయుధం కూడా లేదు.. కానీ పిరికిపందలు ప్రతిఘటించడానికి భయపడ్డారని అంది. అవమానం, అక్కడున్న వారి యువతిని రక్షించగిగారు అని ఎద్దేవా చేశారు.  నిజంగా అక్కడున్న వారంతా సిగ్గుపడాలని ట్విట్ చేశారు. ఆ హత్య సీసీపుటేజ్ ను ట్విట్ చేస్తూ ఆమె బాధను వ్యక్తపరిచింది.