
నందమూరి బాలకృష్ణ(Balakrishna)తో ‘బంగారు బుల్లోడు(Bangaru bullodu)’ సినిమాలో ఆడిపాడింది హీరోయిన్ రవీనా టాండన్(Raveena Tandon). చాలా గ్యాప్ తర్వాత ‘కేజీఎఫ్ 2(KGF2)’ సినిమాతో సౌత్‌లో మరోసారి పాపులర్‌గా మారింది. ఇప్పుడు రవీనా కూతురు రాషా థడానీ(Rasha Thadani) సినీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్(Ajay devgan) మేనల్లుడు ఆమన్ దేవ్‌గణ్(Aaman devgan) హీరోగా ఓ సినిమా వస్తుంది.
ఇందులో రాషా తన బాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. ఈ విషయాన్ని మూవీ టీం ప్రకటించింది. ఈ నటికి హీరోయిన్ అయ్యేంత కూతురు ఉందా? అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్(Suhana khan), కాజోల్ గారాల పట్టి నైసా దేవ్‌గణ్(Naisa devgan) కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక రాషా లేటెస్ట్ ఫొటోలు చూసిన వారంతా అచ్చం తల్లిలాగే అదరగొడుతోందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ బ్యూటీని బాలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.