బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రవిప్రకాశ్ విచారణ

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రవిప్రకాశ్ విచారణ

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్. టీవీ9 లోగోను విక్రయించారన్న ఆరోపణలపై రవిప్రకాశ్ పై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు రవి ప్రకాష్. ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రవిప్రకాశ్ విచారణ కొనసాగుతోంది.

గడిచిన 3 రోజులుగా సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు రవిప్రకాశ్ హాజరయ్యారు. ఫరోజరీ, నిధుల మళ్లింపు, డేటా చోరీ కేసుల్లో రవిప్రకాశ్ తో పాటు… నాలుగో నిందితుడిగా ఉన్న ఫైనాన్స్ డైరెక్టర్ ఎంవీకేఎన్ మూర్తిని .. ఏసీపీ శ్రీనివాస్ టీమ్ ప్రశ్నించింది.  రవిప్రకాశ్, మూర్తి ఇద్దరు చెప్పిన వివరాలను పోలీసులు పోల్చి చూశారు. రవి ప్రకాశ్ తప్పుడు వివరాలు ఇచ్చినట్టు తేలితే.. అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. టీవీ9 లోగో అక్రమంగా విక్రయించారనే ఆరోపణలపై రవిప్రకాశ్ కు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు పంపించారు బంజారాహిల్స్ పోలీసులు. నిన్న మరోసారి నోటీసులు పంపడంతో.. శుక్రవారం నాడు విచారణకు హాజరయ్యారు రవిప్రకాశ్.