
రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆగస్టు 15న థియేటర్లలో విడుదల అయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ వంటి విజువల్స్ తో ఆడియన్స్ లో హైప్ పెంచింది. మరి రిలీజ్ తర్వాత ఫస్ట్ డే ఎలాంటి వసూళ్లు సాధించిందో చూద్దాం.
రవితేజ 'మిస్టర్ బచ్చన్ ఆగస్టు 14న (నైట్ షోలు) దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించింది. ప్రముఖ ట్రేడ్ నిపుణుల ప్రకారం, ఈ మూవీ ఇండియాలో నైట్ షోల నుండి దాదాపు రూ.1.8 కోట్ల నికర ఆదాయం రాబట్టింది. ఇక ఆగస్ట్ 15న కమర్షియల్ ఎంటర్టైనర్ రిలీజ్ అవ్వగా రూ.3.5 కోట్ల నికర వసూలు చేసింది. దీంతో 'మిస్టర్ బచ్చన్' దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.5.3 కోట్ల నికర వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే, ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, 'మిస్టర్ బచ్చన్' సినిమాకు ఫస్ట్ డే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోయినప్పటికీ..వీకెండ్ వస్తుండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నాయి. ఏదేమైనా రవితేజ మాస్ గ్రేస్ తో ఆడియన్స్ ని బచ్చన్ సినిమా చూసేలా చేస్తాడనడంలో సందేహం లేదు.
బాలీవుడ్ మూవీ రైడ్‌కు రీమేక్‌గా మిస్టర్ బచ్చన్ సినిమాను డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించారు. చాలా మార్పులతో తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా రవితేజ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.