MassJathara: ‘మాస్ జాతర’ టీజర్ అప్డేట్.. రవితేజ మాస్ రాంపేజ్కు ముహూర్తం ఫిక్స్

MassJathara: ‘మాస్ జాతర’ టీజర్ అప్డేట్.. రవితేజ మాస్ రాంపేజ్కు ముహూర్తం ఫిక్స్

మాస్ రాజా రవితేజ, బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. భాను భోగవరపు తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇటీవలే ఓ రెండు క్రేజీ సాంగ్స్ రిలీజ్ చేసి యూత్లో అంచనాలు పెంచేశారు. 

ఈ క్రమంలో మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్తో ముందుకొచ్చారు. ఇవాళ రాఖీ స్పెషల్గా ‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. సోమవారం (ఆగస్టు 11న) ఉదయం 11:08 గంటలకు టీజర్ విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో రవితేజ పవర్ ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు. వింటేజ్ మాస్ జాతర పూర్తి స్థాయిలో ప్రదర్శించబడుతోంది. వేచి ఉండండని మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే రిలీజ్ చేసిన  గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ సైతం సినిమాపై అంచనాలు పెంచింది. 

దర్శకుడు భాను భోగవరపు:

శ్రీవిష్ణు బ్లాక్ బస్టర్ సామజవరగమన మూవీకి కథను అందించిన.. కథ రచయిత భాను భోగవరపు. తన మొదటి సినిమాను రవితేజను డైరెక్ట్ చేయడం మరింత స్పెషల్గా ఉండనుంది. అందుకు తగ్గట్టుగానే సినిమాలో రవితేజను పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా చూపించనున్నాడు. మరి ఈ సినిమా కూడా ధమాకా రేంజ్లో భారీ విజయాన్ని సాధిస్తుందా చూడాలి.

ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న సినిమా విడుదల కానుంది.