Ravi teja, Sreeleela: మొదలైన రవితేజ మాస్ దావత్.. శ్రీలీలతో మరోసారి

Ravi teja, Sreeleela: మొదలైన రవితేజ మాస్ దావత్.. శ్రీలీలతో మరోసారి

మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమాను షురూ చేశారు. ఆయన కెరీర్ లో 75వ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలతో లాంఛనంగా మొదలయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

రవితేజ, శ్రీలీల కాంబోలో గతంలో ధమాకా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో తెరపై ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా కూడా ధమాకా రేంజ్ లో భారీ విజయాన్ని సాధిస్తుందా చూడాలి.    

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.