
రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతోంది. ఇప్పటికే పాటలతో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. ఆదివారం రిలీజ్ చేసిన టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇందులో సిన్సియర్ ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా వింటేజ్ లుక్‌లో రవితేజ కనిపించాడు. ‘ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్.. నల్లధనం.. సక్సెస్, ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాలాంటివి.. వస్తుంటాయ్, పోతుంటాయ్.. యాటిట్యూడ్ ఇంటిపేరు లాంటిది..
అది పోయేదాకా మనతోనే ఉంటుంది’ అని రవితేజ చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. భాగ్య శ్రీ బోర్సే గ్లామర్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, ఝాన్సీ ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ‘మిస్టర్ బచ్చన్’ విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల పాల్గొన్నారు.