‘వాల్తేరు వీరయ్య’తో వస్తున్న రవితేజ

 ‘వాల్తేరు వీరయ్య’తో వస్తున్న రవితేజ

‘ధమాకా’ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన రవితేజ.. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో థియేటర్స్‌‌‌‌కు వస్తున్నాడు. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించాడు రవితేజ. మరోవైపు అతను హీరోగా నటిస్తున్న రెండు చిత్రాలు రిలీజ్‌‌‌‌కు రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ‘రావణాసుర’. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్.  

సుశాంత్ కీ రోల్ చేస్తున్నాడు. ఏప్రిల్ 7న రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్... వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం డబ్బింగ్ ప్రారంభించారు. రవితేజ హీరోగా నటిస్తోన్న మరో చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ఇదే రోజున స్టార్ట్ చేశారు. స్టూవర్ట్ పురానికి చెందిన నాగేశ్వరరావు అనే గజ దొంగ బయోపిక్ ఇది. ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ను వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నుపూర్‌‌‌‌ సనన్‌‌‌‌, గాయత్రీ భరద్వాజ్‌‌‌‌ హీరోయిన్స్. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.