తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లో స్టార్ హీరోయిన్ అవుతుంది:రవితేజ

తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లో  స్టార్ హీరోయిన్ అవుతుంది:రవితేజ

ఈ ఏడాది ఆల్రెడీ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ... ఇప్పుడు ‘ధమాకా’తో వస్తున్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా రవితేజ ఇలా ముచ్చటించాడు. 

‘‘రాజా ది గ్రేట్ తర్వాత చేస్తున్న కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ ఇది.  ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రసన్న కుమార్ కథతో పాటు డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. త్రినాథరావుతో వర్క్ చేయడం అందరికీ కంఫర్ట్‌‌‌‌‌‌‌‌బుల్‌‌‌‌‌‌‌‌గా వుంటుంది.  ప్రసన్న, త్రినాధరావు కాంబో చక్కగా కుదిరింది. వాళ్ళ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన అన్ని సినిమాలు వర్కవుట్ అయ్యాయి. శ్రీలీలలో గ్లామర్, యాక్టింగ్‌‌‌‌‌‌‌‌ టాలెంట్‌‌‌‌‌‌‌‌తోపాటు  డ్యాన్స్, వాయిస్, ఎనర్జీ లాంటివన్నీ వున్నాయి. పైగా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లో స్టార్ హీరోయిన్ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా వుంటారు. వ్యక్తిగతంగా కూడా నాకు చాలా ఇష్టం. అలాంటి వారికి విజయాలు వస్తే చాలా మందికి ఉపాధి కలుగుతుంది. వారితో ఎన్నిసార్లయినా పని చేస్తాను. భీమ్స్ సిసిరోలియో ‘ధమాకా’ ఆల్బమ్‌‌‌‌‌‌‌‌ను ఇరగదీశాడు. తను చాలా మంచి ట్యూన్ మేకర్ కూడా. పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫైనల్‌‌‌‌‌‌‌‌గా ఇది ‘రౌడీ అల్లుడు’ లాంటి ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ‘వాల్తేరు వీరయ్య’లో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నా. చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. అన్నయ్యతో సినిమా చేయడం గొప్ప అనుభవం. కథ, క్యారెక్టర్ అద్భుతంగా కుదిరాయి. ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వర రావు' చేస్తున్నా . నిర్మాతగా మా బ్యానర్ లో వచ్చే సినిమాలు గురించి త్వరలో చెబుతా. నేను జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాను. షూటింగ్ అంటే పండగ నాకు. నాకు ఏ రోజూ బోర్ కొట్టదు. బోర్ అనే పదం నా డిక్షనరీ లో లేదు’’.