
దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. సంక్రాంతికి ‘ఈగల్’ చిత్రంతో రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా, సోమవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘కొండలో లావని కిందకి పిలవకు... ఊరు ఉండదు...నీ ఉనికి ఉండదు’ అంటూ రవితేజ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో, స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ టీజర్ ఓపెన్ అయ్యింది. ప్రజలకు అపోహగా, ప్రభుత్వాలు దాచిపెట్టిన కథగా హీరో చేసే విధ్వంసమైన విజువల్స్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. లుంగీ పైకి కట్టి, గన్‌తో ఫైరింగ్ చేస్తూ.. ఇంటెన్స్ లుక్‌లో మెస్మరైజ్ చేశారు రవితేజ. అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్‌తో రవితేజ క్యారెక్టర్‌ను మరింత ఎలివేట్ చేశారు. ‘ఇది విధ్వంసం మాత్రమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపం’ అంటూ నవదీప్ చెప్పే డైలాగ్ క్యూరియాసిటీని పెంచేలా ఉంది. దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా తనదైన టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు కార్తీక్ ఘట్టమనేని. కావ్యా థాపర్ మరో హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మధుబాల, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. జనవరి 13న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.