V6 News

‘అక్కాయిలు బాగున్నారా!’.. రవితేజ సినిమా టైటిల్ క్రేజీ ఉందిగా..!

‘అక్కాయిలు బాగున్నారా!’.. రవితేజ సినిమా టైటిల్ క్రేజీ ఉందిగా..!

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ఆడియెన్స్‌‌ ముందుకొచ్చిన రవితేజ.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే డివోషనల్ మూవీలో నటిస్తున్నారు.  తాజాగా మరో మూవీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. శ్రీవిష్ణుతో  రాజ రాజ చోర, స్వాగ్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌‌లను తెరకెక్కించిన హాసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ నెక్స్ట్ మూవీ ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. రవితేజ కెరీర్‌‌లో విభిన్నమైన  జానర్‌‌లో ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది.

ఈ సినిమాను  ‘అక్కాయిలు బాగున్నారా!’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే  ఈ టైటిల్‌‌ పట్ల అప్పుడే  సోషల్ మీడియాలో డిఫరెంట్ వాయిసెస్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ రానుందని సమాచారం. ఇదే  కనుక నిజమైతే.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత దిల్ రాజు బ్యానర్‌‌‌‌లో రవితేజ నటిస్తున్న చిత్రమవుతుంది. 2017లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో  దిల్ రాజు నిర్మించిన ‘రాజా ది గ్రేట్’ మూవీ తర్వాత రవితేజ, దిల్ రాజు కాంబోలో సినిమా రాలేదు. దీంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.