ఎగబడి, కలబడి గెలిచే మాస్

ఎగబడి, కలబడి గెలిచే మాస్

మాస్, కమర్షియల్ సినిమాలకు కేరాఫ్‌‌ అయిన రవితేజ ప్రస్తుతం బ్యాక్  టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌‌తో బిజీగా ఉన్నాడు. వాటిలో ‘ధమాకా’ ఒకటి. త్రినాథరావు నక్కిన దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 23న సినిమా విడుదల కానుంది. మూడు నెలల క్రితమే మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్, ఆల్రెడీ రెండు పాటలను రిలీజ్ చేసింది. శుక్రవారం మూడో పాటను వదిలారు.  మరో డ్యాన్సింగ్ నెంబర్‌‌‌‌గా ‘డు డు’ పాటని కంపోజ్ చేశాడు భీమ్స్ సిసిరోలియో.

‘వీడు ఎగబడి, తెగబడి, కలబడి, గెలిచే మాస్.. వాడు మనసును, మెదడును, పదునుగా విసిరే క్లాస్.. వీడు కాలర్ ఎత్తితే పొగరు, వాడు కార్పొరేట్ పవరు.. వీడు చెయ్యి వేస్తే పిడుగు, వాడు వెయ్యి వాట్స్ వెలుగు. డబ డు డు డు’ అంటూ రవితేజ క్యారెక్టర్‌‌‌‌ని  ఎలివేట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌‌తో రవితేజ ఇంప్రెస్ చేశాడు. పృథ్వీ చంద్ర ఫెంటాస్టిక్‌‌గా పాడాడు. సాంగ్ లిరిక్స్‌‌ని బట్టి ఇందులో రవితేజ డ్యూయెల్ రోల్‌‌లో  కనిపించనున్నట్టు అర్ధమవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌‌ప్లే, డైలాగ్స్ ప్రసన్న  కుమార్ బెజవాడ అందించారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు.