తండ్రీకూతుళ్ల అనుబంధంతో హార్ట్ టచ్చింగ్‌‎గా‌ రవితేజ ఇరుముడి మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ పోస్టర్

తండ్రీకూతుళ్ల అనుబంధంతో  హార్ట్ టచ్చింగ్‌‎గా‌ రవితేజ ఇరుముడి మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ పోస్టర్

రవితేజ హీరోగా శివ నిర్వాణ  దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై  నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’.   ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.  మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌‌ను జూన్ 3న విడుదల చేయనున్నారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌‌మెంట్ పోస్టర్ హార్ట్ టచ్చింగ్‌‌గా ఉంది. రవితేజ,  అతని  కుమార్తెతో  వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ అందమైన కుటుంబం, తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలియజేశారు.

ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.  జులై లేదా ఆగస్టులో సినిమా రిలీజ్‌‌కు  ప్లాన్ చేస్తున్నారు.