వైరల్ అవుతున్న గల్లీ క్రికెట్ వీడియో

వైరల్ అవుతున్న గల్లీ క్రికెట్ వీడియో

మన దేశంలో ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ లాంటి వరల్డ్ ఫేమస్ ఆటలకన్నా క్రికెట్‌కే అభిమానులు ఎక్కువ. రియల్ క్రికెట్ అయినా, గల్లీ క్రికెట్ అయినా కోట్లమంది భారతీయుల్లో అంతర్భాగం అయింది. అలాంటిది ఆటపై చేసే కొన్ని ఫన్నీ రీల్స్ అభిమానుల్తో పాటు, క్రికెట్ ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు పూయిస్తాయి. అలాంటి ఒక వీడియోనే రవిచంద్రన్ అశ్విన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దానికి అందరినుంచి విశేష స్పందన వస్తోంది.

వీడియో స్టార్టింగ్‌లో రోడ్డుపై క్రికెట్ ఆడుతున్న కొందరు పిల్లలు కనిపిస్తారు. వాళ్లలో బౌలర్ బంతికి బదులు చిన్న పిల్లాడ్ని నెడతాడు. అతను వెళ్లి బ్యాట్స్‌మెన్ కాళ్లకు తాకుతాడు. తర్వాత బౌలర్ ఎల్‌బిడబ్ల్యూ అప్పీల్ చేస్తే, దానికి అంపైర్ ఔట్ ఇస్తాడు. దాంతో వెంటనే బ్యాట్స్‌మెన్ డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌‌ఎస్) అడుగుతాడు. వెంటనే ఫీల్డ్ ఎంపైర్ థార్డ్ ఎంపైర్‌‌కి రిఫర్ చేస్తాడు. డీఆర్‌‌ఎస్ రివ్యూలో పిల్లాడు బ్యాట్స్‌మెన్ బ్యాట్‌కి తాకకుండా, అతని కాళ్ల మధ్యలోనుంచి వెళ్లి వికెట్లని తాకుతాడు. ఆ డీఆర్‌‌ఎస్ రివ్యూ చూడ్డానికి చాలా ఫన్నీగా ఉండటంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.