భారత్లో జరిగే వరల్డ్ కప్లో పాక్ సచ్చినట్లు ఆడాల్సిందే

భారత్లో జరిగే వరల్డ్ కప్లో పాక్ సచ్చినట్లు ఆడాల్సిందే

పాకిస్థాన్లో ఆసియాకప్ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. పాక్లో ఆసియాకప్ నిర్వహిస్తే టీమిండియా ఆడదని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా పాక్లో జరిగే ఆసియాకప్లో పాల్గొనకపోతే ..భారత్లో జరిగే వరల్డ్ కప్లో పాక్ ఆడదంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో జరగాల్సిన ఆసియా కప్ - 2023ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాలతో చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

వరల్డ్ కప్లో పాక్ ఆడుతుంది

ఆసియాకప్ను పాకిస్థాన్లో నిర్వహిస్తే భారత్ ఆడదని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో తాము బీసీసీఐ ఆదేశాలను పాటిస్తామని అశ్విన్ తెలిపాడు. అయితే ఒక వేళ భారత్ ఆడాలి అనుకుంటే ఆసియాకప్ వేదికను తప్పక మార్చాల్సిందేనని చెప్పాడు. గతంలోనూ ఆసియాకప్ వేదికలు మార్చిన సంఘటలున్నాయన్నాడు. భారత్ పాక్లో జరిగే ఆసియాకప్లో పాల్గొనకుంటే..పాకిస్థాన్ భారత్లో జరిగే వరల్డ్ కప్లో పాల్గొనకుండా ఉంటుందని తాను అనుకోవడం లేదన్నాడు. 

లంక అయితే బెటర్..

ఆసియాకప్ వేదికను నిర్ణయించడంలో తుది నిర్ణయం ఏసీసీదే అని అశ్విన్ అన్నాడు. అయితే ఆసియాకప్ను యూఏఈలో నిర్వహించాలని అనుకుంటే..యూఏఈకి బదులు శ్రీలంకతో నిర్వహిస్తే బాగుటుందని చెప్పాడు. భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కూ కూడా ఇది దోహదపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.