Ashwin: స్మిత్కు అశ్విన్ వార్నింగ్..ఒక్కసారిగా నవ్విన కోహ్లీ

Ashwin: స్మిత్కు అశ్విన్ వార్నింగ్..ఒక్కసారిగా నవ్విన  కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్తోనే కాదు తన యాక్షన్తోనూ భయపెట్టాడు. మన్కడింగ్ను ఐసీసీ రనౌట్గా మార్చిన నేపథ్యంలో రెండో టెస్టు మూడో రోజు ఆటలో స్టీవ్ స్మిత్కు అశ్విన్ జలక్ ఇచ్చాడు.   

అశ్విన్ బౌలింగ్లో మార్నస్ లబూషేన్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో స్టీవ్ స్మిత్ ఉన్నాడు.  అశ్విన్  బాల్ వేయడానికి ముందుకు రాగానే స్మిత్ కూడా అలవాటుగా క్రీజు దాటి ముందుకు వచ్చాడు.  అయితే ఈ సమయంలో బంతిని వేయబోయిన  అశ్విన్..రిలీజ్ చేయకుండా స్మిత్ వైపు చూశాడు. అది చూసిన స్మిత్ వెంటనే వెనక్కు తిరిగి క్రీజులోకి పరిగెత్తాడు. ఆ తర్వాత అశ్విన్ నవ్వుతూ మళ్లీ బౌలింగ్ చేశాడు. 

అవుట్ చేయకుండా వార్నింగ్ ఇచ్చిన ఆశ్విన్కు స్మిత్ థ్యాంక్స్ అంటూ థంబ్స్ అప్ చూపించాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తూ ఇదంతా చూస్తున్న కోహ్లీ..ఒక్కసారిగా నవ్వేశాడు. ప్రస్తుతం  దీనికి సంబంధించిన వీడియో  వైరల్గా మారింది.