ఈరోజు(డిసెంబర్ 6) ఐదుగురు భారత క్రికెటర్లు పుట్టినరోజు.. వారెవరో చూడండి

ఈరోజు(డిసెంబర్ 6) ఐదుగురు భారత క్రికెటర్లు పుట్టినరోజు.. వారెవరో చూడండి

దేశంలో వీరు ఐదుగురు ఉన్నారా..! వాళ్లు ఎప్పుడు పుడితే మాకేంటి అనుకోకండి. మన దేశం.. మన క్రికెటర్లు. వారు మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గొప్పగా చెప్పుకోవాల్సిన సందర్భం. ఆ స్థానంలో మీరున్నా గొప్ప విశేషమే. ఇప్పుడు చెప్పేదేంటంటే.. ఈరోజు (డిసెంబర్ 6) ఐదుగురు భారత క్రికెటర్లు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తద్వారా వారి వారి వయసును ఒక ఏడాది పెంచుకుకుంటున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.. 

రవీంద్ర జడేజా: ఆల్ రౌండర్‌గా ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ భారత క్రికెట్ లో చెరగని ముద్ర వేసుకున్నాడు. బౌలింగ్‌లో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగల ఈ గుజరాతీ యువకుడు బ్యాటింగ్‌లోనూ రాణించగలడు. జడేజా నేడు 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

జస్ప్రీత్ బుమ్రా: వినూత్న బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకుపుట్టించే బుమ్రా నేటితో 30లోకి అడుగుపెట్టాడు. తక్కువ వయసే కనుక భారత పేస్ దళానికి మరో ఐదారేళ్ల పాటు ఎలాంటి డోకా లేదు.

శ్రేయాస్ అయ్యర్: భారత మిడిల్ ఆర్డర్‌కు వెన్నుముక అయిన అయ్యర్‌కు నేటితో 28 ఏళ్లు నిండాయి. చూస్తే అలా కనిపించడే అనుకోకండి. ఇంకా చిన్నపిల్లాడే. కాకపోతే రొమాంటిక్ గాయ్ కాబట్టి అక్కడక్కడా కనిపిస్తుంటాడు.

వీరితో పాటు భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్, కరుణ్ నాయర్‌లు బుధవారంతో ఒక సంవత్సరం నిండుకున్నారు. కరుణ్ నాయర్‌ 32లోకి అడుగుపెట్టగా, ఆర్పీ సింగ్ 38వ వసంతంలోకి ఎంట్రీ ఇచ్చాడు.