కపిల్ రికార్డును అధిగమించిన జడ్డూ

కపిల్ రికార్డును అధిగమించిన జడ్డూ
  • 35 ఏళ్లుగా ఎవరికి అందని ఫీట్
  • 7వ స్థానంలో వచ్చి 175 రన్స్ 

కపిల్ దేవ్ పేరిట 35 ఏళ్లుగా ఉన్న రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. మొహాలీలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో జడేజా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ లో  7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జడేజా.. 3 సిక్సర్లు, 17 ఫోర్లతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ నుంచి 7వ స్థానంలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా జడేజా చరిత్రపుటల్లో నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు లెజండరీ ప్లేయర్ కపిల్ దేవ్ పై ఉండేది. 1986 లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ లో కపిల్ దేవ్ 7వ స్థానంలో వచ్చి 163 పరుగులు సాధించాడు. దాదాపు 35 ఏళ్లుగా ఏ ఒక్క భారతీయ ఆటగాడు కపిల్ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. కానీ, ఎట్టకేలకు రవీంద్ర జడేజా తన అద్భుతమైన ఆటతో కపిల్ రికార్డును అధిగమించాడు. కాగా.. భారత్  574 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.

మరిన్ని వార్తల కోసం:

విరాట్ వందో టెస్టులో జడేజా సెంచరీ