ఎగిరి సిక్స్ ఆపాడు : జడేజా అద్భుత విన్యాసం

ఎగిరి సిక్స్ ఆపాడు : జడేజా అద్భుత విన్యాసం

ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ క్రికెట్ అభిమానులకు పండుగ చేస్తోంది. సిక్సర్లు, బౌండరీల బొనాంజా… క్రికెట్ ఫ్యాన్స్ కు మస్త్ మజానిస్తోంది. భారీ షాట్లతో బ్యాట్స్ మన్ అదరగొడుతుంటే… మెరుపు బౌలింగ్ తో వికెట్లు తీస్తూ బౌలర్లు వావ్ అనిపిస్తున్నారు. మరోవైపు.. కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు కూడా ఈ ఐపీఎల్ లో ఎన్నో కనిపిస్తున్నాయి. అలాంటి ఓ వండర్ ఫీట్ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. లో-స్కోరింగ్ మ్యాచే అయినా… అభిమానులను ఆకట్టుకుంది ఈ గేమ్. రసెల్ ఒక్కడే కేకేఆర్ తరఫున పోరాటం చేశాడు. ఐదు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసి ఆ జట్టుకు ఆ మాత్రం స్కోరైనా అందించాడు. రసెల్ స్కోరులో మరో సిక్స్ కూడా ఉండేదే. కానీ.. బౌండరీలో CSK ఫీల్డర్ రవీంద్ర జడేజా… అద్భుతం చేశాడు. సిక్సర్ ను ఆపాడు. రసెల్ భారీ షాట్ కొట్టి.. బంతిని స్టాండ్స్ లోకి పంపితే… బౌండరీలో రవీంద్రజడేజా అమాంతం ఎగిరి బాల్ ను బౌండరీ ఇవతల పడేశాడు. సిక్సర్ ను ఆపేశాడు.

ఆ ఫీట్ చూసిన అందరూ.. వావ్ రవీంద్రజడేజా అనేస్తున్నారు. ఆ విన్యాసం ఓసారి మీరూ చూడండి.

https://www.iplt20.com/video/166316/sprinting-jaddu-saves-a-six