
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాబోయే లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆమె ఇటివలే బీజేపీలో చేరారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్ సీటు ఆశిస్తున్నారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తమ అభ్యర్థిగా పాటిదార్ నేత హార్దిక్ పటేల్‌ను బరిలోకి దించాలని నిర్ణయించింది. దీంతో జామ్‌నగర్ లోక్‌సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. గుజరాత్‌లోని కర్నిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్న రివాబా.. క్షత్రియ వర్గీయుల మద్దతుతో ఈ నెల మొదటివారంలో బీజేపీ లో చేరారు.