రవితేజ ‘ధమాకా’ టీజర్

రవితేజ ‘ధమాకా’ టీజర్

మాస్ మహారాజ రవితేజ న్యూ ఫిల్మ్ ‘ధమాకా’ టీజర్ విడుదలైంది. మాస్ క్రాకర్ పేరుతో దీపావళి కానుకగా విడుదల చేసిన టీజర్ లో పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో సినిమా రూపొందింది. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ సైలెన్స్ ను భుజాన మోసుకుంటూ.. రవితేజ రావడంతో టీజర్ ప్రారంభమైంది. విలన్లను ఆ సైలెన్సర్ తో చితక్కొడుతాడు. ‘అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి దీపావళే’ అంటూ టీజర్ చివరిలో  రవితేజ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. 

‘ధమాకా’ లో రవితేజ మాస్ పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ‘ధమాకా’ సిద్ధమైంది. రవితేజ సరసన ‘పెళ్లి సందడి’ ఫేం శ్రీలీల నటిస్తున్నారు. జయరాం విలన్ పాత్రను పోషించారు.  అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ లు అభిమానులను ఆకట్టుకున్నాయి. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు ‘ధమాకా’ రానుంది.