
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. రీసెంట్‌గా కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో ఓ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనుంది టీమ్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు సాంగ్స్ కూడా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. హీరో సహా ప్రధాన పాత్రధారులంతా ఈ షెడ్యూల్‌లో జాయిన్ కానున్నారు. రవితేజ నటిస్తోన్న 76వ సినిమా ఇది.
ఆయన మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌తో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు కిషోర్ తెలియజేశాడు. ఈ చిత్రం కోసం రవితేజ స్టైలిష్‌గా మేకోవర్ అయ్యాడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.