రవితేజ కిషోర్ తిరుమల మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌ స్పెయిన్‌‌‌‌లో..

రవితేజ కిషోర్ తిరుమల మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌  స్పెయిన్‌‌‌‌లో..

రవితేజ హీరోగా  కిషోర్ తిరుమల డైరెక్షన్‌‌‌‌లో ఓ మూవీ తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.  శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్‌‌‌‌ కోసం టీమ్ ఫారిన్‌‌‌‌కు షిఫ్ట్ అయ్యింది.   గత కొన్ని రోజులుగా స్పెయిన్‌‌‌‌లోని వాలెన్షియా, సమీప దీవుల్లో లొకేషన్ రిక్కీ చేయగా, శుక్రవారం నుంచి అక్కడ షూటింగ్ స్టార్ట్ చేశారు. 

తర్వాత   జెనీవా, ఫ్రాన్స్‌‌‌‌లో కూడా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 25 రోజుల ఈ షెడ్యూల్‌‌‌‌లో కీలక టాకీ పార్ట్‌‌‌‌తో పాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో  రెండు పాటలు షూట్ చేయబోతున్నారు. రవితేజ నటిస్తోన్న 76వ సినిమా ఇది.  

ఆయన మార్క్  కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌‌‌‌తో కూడిన ఫుల్ లెంగ్త్  ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు కిషోర్ తెలియజేశాడు. ఈ చిత్రం కోసం రవితేజ  స్టైలిష్‌‌‌‌గా మేకోవర్ అయ్యాడు.  సీనియర్ టెక్నీషియన్స్‌‌‌‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ళ  సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా, నేషనల్ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌‌‌‌‌‌‌‌గా ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.