బుక్ మై షోలో వెంకీ రికార్డ్..ఒక్క థియేటర్లోనే 6 వేల 500 టికెట్లు..

బుక్ మై షోలో వెంకీ రికార్డ్..ఒక్క థియేటర్లోనే 6 వేల 500 టికెట్లు..

మాస్ మహరాజా రవితేజ(Raviteja) నటించిన వెంకీ (Venky)  సినిమాను మళ్లీ విడుదల చేయడం పట్ల అనుమానాలు తలెత్తాయి. ట్రెండ్ చూస్తుంటే దానికి భిన్నంగా కనిపిస్తోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన తొలిరోజే 6 వేల 500 టికెట్లు అమ్ముడుపోవడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇది బుక్ మై షో(Bookmyshow) యాప్లో అధికారికంగా చూపిస్తున్న డిజిటే. అలా అని తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో అమ్మకాలు జరగడం లేదు. కేవలం హైదరాబాద్ క్రాస్ రోడ్స్ నుంచే ఇంత పెద్ద ఫిగర్ నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి.

రవితేజ కెరీర్లో వెంకీ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా గంటకు పైగా సాగే సుధీర్ఘమైన ట్రైన్ ఎపిసోడ్ థియేటర్లలో ఓ రేంజ్లో పేలింది. బ్రహ్మానందం, ఏవీఎస్, మాస్టర్ భరత్ల పాటు హీరో ఫ్రెండ్స్ బృందం చేసే కామెడీ మాములుగా నవ్వించలేదు. ఇప్పటికీ ఎన్నో మీమ్స్ వీటిని ఆధారంగా చేసుకునే వస్తుంటాయి.

ఇందులో బ్రహ్మీ ఎక్స్ ప్రెషన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు శ్రీను వైట్ల రేంజ్ పెరగడంలోనూ ఇది దోహదపడింది. హీరోయిన్ స్నేహ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అశుతోష్ రానా విలనీ, చక్కని హాస్యం ఇలా ఎన్నో అంశాలు విజయానికి దోహదపడింది.

ఈ నెల 30న వెంకీని రిలీజ్ చేస్తుండగా మరుసటి రోజు 31న రజనీకాంత్ శివాజీ రాబోతోంది. దీనికి వెంకీ స్పందనలో సగం కూడా లేకపోవడం ఇరువురి ఫ్యాన్స్కి ఆశ్చర్యం కలిగిస్తోంది. 

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా టైగర్ నాగేశ్వర రావుతో డీసెంట్ హిట్ అందుకోగా..ఇప్పుడు ఈగల్ తో సంక్రాంతి రేసులో నిలిచాడు.