'రాయవలస' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకుంటున్న కార్తీక్ జయంతి!

'రాయవలస' రిలీజ్ డేట్ ఫిక్స్..  ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకుంటున్న కార్తీక్ జయంతి!

టాలీవుడ్‌లోకి హీరో ఎంట్రీ ఇస్తున్న కార్తీక్ జయంతి చిత్రం 'రాయవలస'. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ జె నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్నారై దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా.. లేటెస్ట్ గా మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇందులో హీరో కార్తీక్ జయంతి ఇంటెన్స్ లుక్, వెనుక అమ్మవారి ప్రతిరూపం పోస్టర్‌కు పవర్‌ఫుల్ ఫీల్‌ను తీసుకొచ్చాయి. ఈ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచుతుండగా, కథలో ఎలాంటి భావోద్వేగాలు, సంఘర్షణలు ఉండబోతున్నాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రాన్ని నటీనటులు, సాంకేతిక బృందం ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయడం విశేషం. కథానాయిక శ్రీషా నులు ఇందులో రాణి పాత్రలో కనిపించనున్నారు. సహజమైన నటన, హుందాతనంతో ఈ పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని చిత్రబృందం చెబుతోంది. తొలి సినిమాతోనే కార్తీక్ జయంతి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు.

ALSO READ :  డబ్బు కోసం దొంగగా మారిన మౌళి.. 'దొంగ నా కొడుకు' టీజర్ అదిరిందిగా!

సంగీత దర్శకుడు అర్జున్ బాల స్వరపరిచిన 'రింగుడు రింగుడు' పాట యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి మంచి స్పందనను అందుకుంది. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రమ్య బెహరా సహా పలువురు గాయనీగాయకులు ఈ చిత్రానికి పాటలు పాడారు.  అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన 'రాయవలస' డిసెంబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. కొత్త హీరో, గ్రామీణ నేపథ్యంత వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.