Razakar Movie: పార్క్ హయత్లో రజాకర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్..మరి రిలీజ్ అయ్యేనా!

Razakar Movie: పార్క్ హయత్లో రజాకర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్..మరి రిలీజ్ అయ్యేనా!

బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, అనసూయ మకరంద్‌ దేశ్‌ పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘రజాకర్‌’(Razakar). యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు. తాజాగా రజాకార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ను ప్రకటించారు మేకర్స్. మార్చి 13 సాయంత్రం 6 గంటలకు పార్క్ హయత్, హైదరాబాద్లో జరగనున్నట్లు తెలిపారు. 

రజాకార్ అనే ఒక విప్లవ పదం వెనుక తెలంగాణ సాయుధ పోరాట గాథలెన్నో కనిపిస్తాయి. ఇక కనిపించని మరెన్నో వెతలను, సామాన్యులు అనుభవించిన వేదనలను చూపించడానికి వస్తున్న మూవీ రజాకార్‌. ఇప్పుడు తెలంగాణ చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం అంటూ రైటర్.. డైరెక్టర్ యాట సత్య నారాయణ రజాకార్‌ మూవీను తెరకెక్కించారు.

ఈ మూవీ 1948 మధ్య కాలంలో ఇండియన్ యూనియన్ లో చేరడానికి ముందు నిజాం హైదరాబాద్లో జరిగిన సంఘటనల బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్,ట్రైలర్ వీపరీతంగా ఆకట్టుకుంది.

'వాళ్ళు ఇక్కడ మతమైనా మారాలి..లేదా రాజ్యమైన వదలాలి..' యుద్ధం చేయాల్సిందే..ఆ మతోన్మాదులను కతం చేయాల్సిందే, చర్చలు లేవు..సందీ లేదు..యుద్ధం జరగాల్సిందే వంటి డైలాగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే ఈ సినిమా రిలీజ్ ఆపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి రిలీజ్ అయ్యే వరకు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అయితే ఉంది.చూడాలి మరి.