
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బహిష్కరణతో అసెంబ్లీలో ఖాళీ అయిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానాన్ని అన్నాడీఎంకే .. ఆర్‌బి ఉదయకుమార్ తో భర్తీ చేసింది. ఉదయకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన్నట్లు ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి తెలిపారు. జూలై 17న జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఉదయకుమార్ ను ఎన్నుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఉదయకుమార్ ప్రస్తుతం తిరుమంగళం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ సెక్రటరీగా ఎస్ఎస్ కృష్ణమూర్తిని ఎన్నుకున్నట్టు వెల్లడించారు. జులై 11న పార్టీ నుంచి పన్నీర్‌సెల్వం బహిష్కరణకు గురయ్యారు.
மாண்புமிகு கழக இடைக்காலப் பொதுச் செயலாளர் திரு.@EPSTamilNadu அவர்களின் முக்கிய அறிவிப்பு. pic.twitter.com/F19VLlFISO
— AIADMK (@AIADMKOfficial) July 19, 2022