కేంద్రానికి రూ. 2.11 లక్షల కోట్లు మంజూరు చేసిన ఆర్బీఐ

కేంద్రానికి రూ. 2.11 లక్షల కోట్లు మంజూరు చేసిన ఆర్బీఐ

2024 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ, 2.11 లక్షల కోట్ల భారీ డివిడెండ్ ను మంజూరు చేసింది. ఇది 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 141 శాతం ఎక్కువ. మరోవైపు ఎమర్జెన్సీ రిస్క్ బఫర్ ను 6 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. FY 23లో సెంట్రల్ బ్యాంక్ రూ.87వేల 416 కోట్లను మిగులుగా కేంద్రానికి బదిలీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్లు డివిడెండ్ ను బదిలీ చేస్తుందని అంచనా వేసినప్పటికీ ఊహించన విధంగా రూ. 2.11 లక్ష లకోట్ల డివిడెండ్ ను మంజూరు చేసింది ఆర్బీఐ. 

ముంబైలో బుధవారం (మే 22) న జరిగిన సెంట్రల్ బోర్డు 608వ సమావేశంలో ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితులపై బోర్డు చర్చించింది. పరిస్థితులకు అనుగుణంగా రూ. 2లక్షల 10వేల 874 కోట్లు కేంద్రానికి బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. 

ప్రతి సంవత్సరం ఆర్బీఐ పెట్టుబడుల నుంచి వచ్చే మిగులు ఆదాయం, దాని డాలర్ నిల్వల మదింపులో హెచ్చు తగ్గులు, కరెన్సీ ప్రింటింగ్ రుసుము నుంచి వచ్చే ఆదాయం ద్వారా కొంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది ఈసారి 141 శాతం పెంపుదలతో డివిడెండ్ ను మంజూరు చేసింది. ఈ పెంపుదలతో ఆర్థిక సంవత్స రం 2025లో జీడీపీ 5.1 శాతం ఆర్థిక లోటు లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్రానికి సహాయపడనుంది.