ముంబై: షేర్లు, డిబెంచర్ల, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌పై ఫైనాన్సింగ్‌ను అందించకుండా రిజర్వ్ బ్యాంక్ మంగళవారం జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను నిషేధించింది. అయితే, కంపెనీ తన ప్రస్తుత లోన్ ఖాతాలకు సేవలను కొనసాగించవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఓ ఫైనాన్సింగ్‌తో పాటు, ఎన్సీడీ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం కంపెనీ మంజూరు చేసిన రుణాలకు సంబంధించి కొన్ని తీవ్రమైన లోపాలు గమనించినందున ఈ చర్య తప్పనిసరి అని ఆర్బీఐ తెలిపింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆర్బీఐ కంపెనీ పుస్తకాలపై పరిమిత సమీక్షను నిర్వహించింది. లోపాలు సరిదిద్దుకున్నట్టు ప్రత్యేక ఆడిట్లో తేలితే ఆంక్షలను తొలగించే అవకాశాలు ఉంటాయి.
