మార్కెట్‌‌‌‌కు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ బూస్ట్‌‌‌‌ .. సుమారు ఒక శాతం లాభపడిన సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ

మార్కెట్‌‌‌‌కు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ బూస్ట్‌‌‌‌ .. సుమారు ఒక శాతం లాభపడిన సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ

ముంబై: ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ  వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించడంతో పాటు, బ్యాంకింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో సంస్కరణలు ప్రకటించడంతో బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ బుధవారం (అక్టోబర్ 01) దూసుకుపోయాయి. సెన్సెక్స్‌‌‌‌ 715 పాయింట్లు (0.89శాతం) పెరిగి 80,983.31 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు (0.92శాతం) పెరిగి 24,836.30 వద్ద సెటిలయ్యాయి.  నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సుమారు 1.30 శాతం లాభపడింది.  

సెన్సెక్స్‌‌‌‌లో టాటా మోటార్స్‌‌‌‌  5.54శాతం లాభంతో టాప్‌‌‌‌ గెయినర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. కోటక్ బ్యాంక్‌‌‌‌, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌  షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్‌‌‌‌, ఎస్‌‌‌‌బీఐ, అల్ట్రాటెక్‌‌‌‌ సిమెంట్‌‌‌‌, టాటా స్టీల్‌‌‌‌ మాత్రం నష్టపోయాయి. బీఎస్‌‌‌‌ఈలో బ్యాంకెక్స్‌‌‌‌, ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌, రియల్టీ, హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌, కన్జూమర్ డిస్క్రిషనరీ  వంటి అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌‌‌‌లు ర్యాలీ చేశాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్1.16శాతం, మిడ్‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌ 0.91శాతం పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లు కూడా బుధవారం పాజిటివ్‌‌‌‌గా కదిలాయి.

కొనసాగుతున్న ఎఫ్‌‌‌‌ఐఐల అమ్మకాలు

ఫారిన్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌ఐఐ) అమ్మకాలు కొనసాగుతున్నాయి. మంగళవారం సెషన్‌‌‌‌లో నికరంగా రూ.2,327 కోట్ల విలువైన షేర్లను అమ్మిన వీరు, బుధవారం మరో రూ.1,600 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.  డీఐఐలు మాత్రం మంగళవారం నికరంగా రూ.5,761 కోట్ల షేర్లను, బుధరవారం రూ.2,900 కోట్ల షేర్లను కొన్నారు.