రద్దయిన 2వేల నోట్లలో 97శాతం తిరిగి వచ్చాయి: ఆర్బీఐ

రద్దయిన 2వేల నోట్లలో 97శాతం తిరిగి వచ్చాయి: ఆర్బీఐ

ముంబై: రద్దయిన 2వేలనోట్లు ఇప్పటివరకు 97.69 శాతం తిరిగి బ్యాంకుకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇంకా రూ. 8,202 కోట్ల విలువైన నోట్లు రావాల్సి ఉందని వెల్లడించింది. 

2023 మే 19న 2వేల నోట్లను రద్దు చేసింది ఆర్బీఐ. ఆ సమయంలో 3.56 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు సర్క్యూలేషన్ లో ఉన్నాయి. అయితే మార్చి 29,2024 నాటికి రూ. 8,202 కోట్ల విలువైన 2వేల నోట్లు రావాల్సి ఉందని ఆర్బీఐ సోమవారం ప్రకటించింది. 

also read : హ్యాపీ బర్త్ డే Gmail.. అప్పుడు ఏప్రిల్ ఫూల్ అన్నారు.. ఇప్పుడు అన్నింటికీ అదే

ఇప్పటికీ దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాల్లో రూ. 2వేల నోట్లను డిపాజిట్ చేసేందుకు లేదా మార్చుకోవడానికి అవకాశం ఉంది.బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ కోసం ఈ నోట్లను ఏదైనా పోస్టాఫీసు నుంచి ఏదైనా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయానికి పంపడానికి ఇండియా పోస్ట్ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.