3 బ్యాంకులకు భారీ జరిమానా

3 బ్యాంకులకు భారీ జరిమానా

న్యూఢిల్లీ: రెగ్యులేటరీ రూల్స్​ను ఉల్లంఘించినందుకు స్టేట్​బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ), కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు దాదాపు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వెల్లడించింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ ఫండ్ స్కీమ్​ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎస్​బీఐకి రూ. 2 కోట్ల పెనాల్టీ విధించింది. 

నో యువర్​ కస్టమర్​(కేవైసీ) గురించి ఆర్​బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ. 66 లక్షల జరిమానా పడింది. కొన్ని ఆదేశాలను పాటించనందుకు కెనరా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.32.30 లక్షల జరిమానా విధించినట్టు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పేర్కొంది.