రెపో రేటు అరశాతం పెంచిన ఆర్బీఐ.. 

రెపో రేటు అరశాతం పెంచిన ఆర్బీఐ.. 

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. తాజా పెంపుతో కలుపుకొని రెపో రేటు 5.90శాతానికి చేరి మూడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు పెంచడం ఇది నాల్గోసారి. మేలో రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ, జూన్, ఆగస్టులో మరో 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. మొత్తమ్మీద ఆర్బీఐ మే నుంచి ఇప్పటి వరకు వడ్డీ రేటును 1.90 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.


ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం సామాన్యుడి బడ్జెట్పై పెనుభారం మోపనుంది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఎక్స్ టర్నల్ బెంచ్ మార్కుగా రెపోరేటును పరిగణలోకి తీసుకుంటున్నాయి. తాజాగా రెపో రేటు పెంపుతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచనున్నాయి.  ఫలితంగా ఇప్పటికే హోం, పర్సనల్, వెహికిల్ లోన్లు తీసుకున్న వారి ఈఎంఐ లేదా రుణాల చెల్లింపు కాలం పెరగనుంది. కొత్తగా రుణం తీసుకోవాలనుకునేవారికి లోన్ మొత్తం తగ్గడంతో పాటు మార్చిన్ మనీ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.