క్యూ4 నుంచి ఆర్​బీఐ వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్

క్యూ4 నుంచి ఆర్​బీఐ వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్

న్యూఢిల్లీ: రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఈ కేలండర్​​ ఇయర్​ నాలుగో క్వార్టర్​ నుంచి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని గ్లోబల్​ ఫోర్​కాస్టింగ్​ సంస్థ ఆక్స్​ఫర్డ్​ ఎకనమిక్స్​ అంచనా వేస్తోంది. ఎకానమీలో చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల పర్యవసానంగానే ఆర్​బీఐకి తన పాలసీ ఫోకస్​ను కొంత ముందుగానే ​ మార్చుకునే వెసులుబాటు కలుగుతుందని వెల్లడించింది.

ఇండియాలో రేట్ల తగ్గుదల స్పష్టంగా కనబడుతోందని, రేట్ల తగ్గుదల విషయంలో కన్జూమర్ల అంచనాలు కూడా మారుతున్నాయని ఆక్స్​ఫర్డ్​ ఎకనమిక్స్​ పేర్కొంది. కాబట్టి, రేట్ల పెంపుదల సైకిల్​ నుంచి రేట్ల కోత ఎప్పుడనే అంశం వైపు ఇప్పుడు అటెన్షన్​ మారిందని వివరించింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలోని ఆర్​బీఐ 2023 క్యూ 4 లో  మొదటిసారిగా రేట్ల కోత చేపట్టే ఛాన్స్​ ఉందని తాము బేస్​లైన్​ను అప్​డేట్​ చేస్తున్నట్లు ఆక్స్​ఫర్డ్​ ఎకనమిక్స్​ వెల్లడించింది. రేట్లు ఇటీవలి కాలంలో దిగివచ్చినా, రేట్ల పెరుగుదల రిస్క్​ మాత్రం ఈ ఏడాది చివరిదాకా ఉంటుందని కూడా అంచనా వేసింది.

ఇన్​ఫ్లేషన్​ బాగా దిగివచ్చిందనే సంకేతాలు స్పష్టంగా కనబడేదాకా వేచి ఉండాలని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) చూస్తోందని ఆక్స్​ఫర్డ్​ ఎకనమిక్స్​ తెలిపింది. తమ రివ్యూ ప్రకారం మొదటి కోత చివరి క్వార్టర్లో (అక్టోబర్​–డిసెంబర్​ 2023) ఉండొచ్చని పేర్కొంది. దేశంలో రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​ 4 శాతానికి మించకూడదని ఆర్​బీఐ టార్గెట్​గా పెట్టుకుంది. ఏప్రిల్​నెల ఎంపీసీ మీటింగ్​లో పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా (పాజ్​) ఆర్​బీఐ మార్కెట్​ను ఆశ్చర్యపరిచింది. బెంచ్​మార్క్​ పాలసీ రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని ఆర్​బీఐ నిర్ణయించింది.