PMC బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు

PMC బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు

ముంబై : పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో–ఆపరేటివ్ బ్యాంక్(పీఎంసీ బ్యాంక్)పై ఆర్‌‌‌‌బీఐ ఆంక్షలు విధించింది. దీంతో ఈ బ్యాంక్‌‌ల బ్రాంచుల వద్ద ఆందోళన నెలకొంది. ఆర్‌‌‌‌బీఐ ఆదేశాల ప్రకారం, పీఎంసీ బ్యాంక్ ఒక్కో అకౌంట్ నుంచి వెయ్యి రూపాయల కంటే ఎక్కువ విత్‌‌డ్రాయల్ చేసుకోవడానికి అనుమతి లేదు. బ్యాంక్ ఎలాంటి రుణాలివ్వడానికి కూడా లేదు. బ్యాంక్ ఫైనాన్సియల్ హెల్త్‌‌, మొండిబాకీలపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆర్‌‌‌‌బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు ఆరు నెలల వరకు కొనసాగే అవకాశాలున్నాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 148 కోట్లుగా ఉన్న బ్యాంక్​ మొండి బకాయిలు 2018–19 నాటికి రూ.315.24 కోట్లకు పెరిగాయి.