
న్యూఢిల్లీ: రెపో రేటును 50 బీపీఎస్ పాయింట్ల మేర పెంచుతూ RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీసీ కమిటీ ఏకగగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ పెంపుతో రెపో రేటు 5.4 శాతానికి చేరిందని.. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) 5.15 శాతానికి సర్దుబాటు చేసిందన్నారు.
GDP వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేశారు. ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్బణం 6.7 శాతం అని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సహజంగానే ప్రభావితమవుతోందని తెలిపారు. ఆర్థికవ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతుందని... ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందన్నారు.
త్వరలోనే వంటనూనెలు దిగి రానున్నాయని చెప్పారు. మూడు నెలల్లో రెపో రేటును పెంచడం ఇది వరుసగా మూడోసారి. గవర్నర్ శక్తికాంత దాస్ నేృత్వత్వంలో మూడు రోజుల సమావేశాల అనంతరం కమిటీ పాలసీ విధానాన్ని ప్రకటించింది. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల క్రమంలో ఆర్బీఐ రేటు పెంపునకే మొగ్గు చూపింది. లేటెస్ట్ గా పెంచిన రెపో రేటుతో బ్యాంక్ కస్టమర్స్‌కి రుణాలపై వడ్డీ భారం పెరగనుంది. నిజానికి రెపో రేటు పెంపు 35 బేసిస్ పాయింట్స్ ఉండొచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ అంతకుమించి 50 బేసిస్ పాయింట్స్ మేర ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది.
RBI hikes repo rate by 50 basis points to 5.4% with immediate effect pic.twitter.com/axs5EMdvIM
— ANI (@ANI) August 5, 2022