షాకింగ్: గోల్డ్ లోన్స్ పై RBI ఆంక్షలు

షాకింగ్: గోల్డ్ లోన్స్ పై RBI ఆంక్షలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్స్ మంజూరుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. IIFL  ఫైనాన్స్ బంగారు రుణాలపై ఆంక్షలు విధించింది.  ఈ రోజు ఆర్బీఐ ఆఫ్ ఇండియా యాక్ట్  1934లోని సెక్షన్ 45L(1)  కింద తనకున్న అధికారాన్ని ఉపయోగించి, IFL ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ సేవలు నిలిపివేయాలని, బంగారం తకట్టు పెట్టుకొని రుణాలు మంజూరు ప్రక్షళల చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న పోర్ట్ ఫోలియోకు అనుగుణంగా లోన్స్ ఇవ్వడం, రికవరీ సర్వీసులు జరపవచ్చని ఆర్బీఐ ఈ రోజు ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 31, 2023 నాటికి ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ ఆర్థిక స్థితిగతులను పరిశీలించిన ఆర్బీఐ ఆశ్చర్యపోయింది. కొత్తగా మంజూరు చేసే లోల్డ్ లోన్స్ పై  రూల్స్ పాటించాలని హెచ్చరించింది.

బంగారం తీసుకున్నప్పుడు, లోన్ రికవరీ సమయాల్లో గోల్డ్ ప్యూరిటీ, క్వాలిటీ టెస్ట్ చేయడం, వివరాలు నమోదు చేయడంలో తేడాలు జరుగుతున్నట్లు ఆర్బీఐ కంపెనీని హెచ్చరించింది. లోన్ టూ వాల్యూ రేషియో ఉల్లంఘిస్తు్న్నట్లు, రూల్స్ వ్యతిరేకంగా తక్కువ బంగారానికి ఎక్కువ లోన్ ఇచ్చి లోన్ తీసుకున్న వారి నుంచి ఎక్కువ వసూలు చేయడం వంటి అవకతవకలు జరుతున్నాయని కంపెనీ యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని  ఆర్బీఐ గోల్డ్ లోన్ కంపెనీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.  వేలం ప్రక్రియకు రూల్స్ పాటించడం లేదని, కస్టమర్స్ నుంచి వసూలు చేసే ఛార్జీలలో పారదర్శకత లోపించిందని ఆర్బీఐ గోల్డ్ లోన్స్ కంపెనీల లోటుపాటులను ఎత్తిచూపింది. కంపెనీలు కస్టమర్లకు ఉపయోగకరంగా ఉండే విధంగా వెంటనే లిమిటేషన్ రూల్స్ విధించాలని కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్లను ఆదేశించింది. ప్రామాణిక వేలం ప్రక్రియకు కట్టుబడి ఉండకపోవడం; మరియు కస్టమర్ ఖాతాలకు విధించే ఛార్జీలు మొదలైన వాటిలో పారదర్శకత లోపించిందని RBI తెలిపింది.