అప్పులే అప్పులు: నాలుగేళ్లలో 33 శాతం పెరిగిన పర్సనల్ లోన్స్

అప్పులే అప్పులు: నాలుగేళ్లలో 33 శాతం పెరిగిన పర్సనల్ లోన్స్

అప్పు కావాలమ్మా.. అప్పు..! అంటూ బ్యాంకులు చుట్టూ బ్యాంకులు చుట్టూ తిరిగే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో గత నాలుగేళ్లలో వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారు 33% పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా, సెప్టెంబర్ 2022 నుంచి 2023 మధ్య 20.8% పెరుగుదల ఉన్నట్లు తెలిపింది. అదే సమయంలో వ్యవసాయ రుణాలు 43.7% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది.

సెప్టెంబరు 2022 నుంచి 2023 మధ్యకాలంలో ఎన్‌బిఎఫ్‌సి రంగం 20.8% క్రెడిట్ వృద్ధిని సాధించింది. ప్రధానంగా వ్యక్తిగత రుణాలు (32.5%), వ్యవసాయ రుణాలు (43.7% వృద్ధి) వృద్ధి సాధించాయి. గత నాలుగు సంవత్సరాల్లో వ్యక్తిగత రుణాలు 33% వార్షిక వృద్ధి రేటు (CAGR)తో మొత్తం క్రెడిట్ వృద్ధిని అధిగమించాయి. మార్కెట్ వాటా పరంగా, వ్యక్తిగత రుణాలు 2.3% పెరిగాయి. అదే సమయంలో వ్యవసాయ రుణాలు సెప్టెంబరు 2023లో 1.9%కి పెరిగాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1.7% పెరుగుదల కనిపించింది.