పేటీఎం వాలెట్ యూజర్లకు ఇబ్బంది ఉండదు : ఆర్​బీఐ

పేటీఎం వాలెట్ యూజర్లకు ఇబ్బంది ఉండదు : ఆర్​బీఐ

న్యూఢిల్లీ: పేటీఎంపై రెగ్యులేటరీ చర్యలు తీసుకున్నప్పటికీ, 80–-85 శాతం పేటీఎం వాలెట్ వినియోగదారులకు ఇబ్బంది ఉండబోదని ఆర్​బీఐ తెలిపింది.  పేటీఎం బ్యాంక్​ వినియోగదారులు తమ ఖాతాను ఇతర బ్యాంకుల ఖాతాలతో లింక్ చేసుకోవాలని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం సూచించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్‌‌‌‌‌‌‌‌లు, క్రెడిట్ లావాదేవీలు, వాలెట్లలో టాప్-అప్‌‌‌‌‌‌‌‌లను చేయకుండా ఆర్​బీఐ ఈ ఏడాది జనవరి 31న నిషేధించింది.

నియమాలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పీపీబీఎల్​ వాలెట్లను ఇతర బ్యాంకులతో లింక్ చేయడానికి ఈ నెల 15 వరకు గడువు ఇచ్చింది.  మరోసారి గడువును పెంచబోని స్పష్టం చేసింది.