రూపాయి డెరివేటివ్‌‌లో బ్యాంకులు ఎక్కువగా పాల్గొనాలి : శక్తికాంత దాస్‌‌

రూపాయి డెరివేటివ్‌‌లో బ్యాంకులు ఎక్కువగా పాల్గొనాలి : శక్తికాంత దాస్‌‌

న్యూఢిల్లీ: రూపాయి డెరివేటివ్స్ మార్కెట్ (కరెన్సీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌‌) లో ఇండియన్ బ్యాంకుల పార్టిసిపేషన్ పెరగాలని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌ శక్తికాంత దాస్‌‌ పేర్కొన్నారు.  డెరివేటివ్ మార్కెట్‌‌లో  కొన్ని  ఇండియన్ బ్యాంకులే యాక్టివ్‌‌గా పాల్గొంటున్నాయని, విదేశీ మార్కెట్లలో పార్టిసిపేషన్ పెరుగుతున్నా, ఇంకా వీటి వాటా తక్కువగానే ఉందని అన్నారు. 

బ్యాంకులు జాగ్రత్త పాటించాలని, తమ రిస్క్ మేనేజ్‌‌మెంట్‌‌ ఫాలో కావాలని సూచించారు. బార్సిలోనాలో జరుగుతున్న ఎఫ్‌‌ఐఎంఎండీఏ–పీడీఏఐ యాన్యువల్ కాన్ఫరెన్స్‌‌లో శక్తికాంత దాస్ పై వ్యాఖ్యలు చేశారు.