పేమెంట్ సిస్టమ్‌‌ లో ఇబ్బందులుండవ్: ఆర్బీఐ

పేమెంట్ సిస్టమ్‌‌ లో ఇబ్బందులుండవ్: ఆర్బీఐ

ముంబై: కరోనా వల్ల  ఫైన్సాన్షియల్‌‌ సర్వీసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఆర్‌‌‌‌బీఐ చర్యలు తీసుకుంది. మొట్టమొదటిసారి తన క్రిటికల్ ఆపరేషన్స్ బిజినెస్ కంటింజెన్సీ ప్లాన్‌‌ను అమల్లోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా నేషనల్ పేమెంట్స్ సిస్టమ్స్‌‌లో ఎలాంటి అవాంతరాలు కలుగకుండా చూస్తోంది. గురువారమే ఆర్‌‌‌‌బీఐ ఈ ప్లాన్‌‌ను లాంచ్ చేసింది. నెఫ్ట్, ఆర్‌‌‌‌టీజీఎస్, ఈ–కుబేర్‌‌ వంటి సర్వీసులన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేందుకు ఈ ప్లాన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్‌‌‌‌బీఐ చెప్పింది. అన్ని వేళలా ఇండివిడ్యువల్స్‌‌కు, బిజినెస్‌‌లకు, గవర్న్‌‌మెంట్స్‌‌కు ఫైనాన్సియల్ సిస్టమ్‌‌ అందుబాటులో ఉండేలా బిజినెస్ కంటింజెన్సీ ప్లాన్ సహకరిస్తోంది.ఈ ప్లాన్ కింద 150 మంది అధికారులతో ఒక టీమ్‌‌ను ఆర్‌‌‌‌బీఐ ఏర్పాటు చేసింది.  వీరిని ప్రైమరీ డేటా సెంటర్‌‌‌‌కు దగ్గర్లోని హోటల్‌‌కు తీసుకొచ్చింది. వీరందరూ ఫైనాన్సియల్ సిస్టమ్‌‌లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనిచేస్తున్నారు.  ఈ టీమ్‌‌ రెండు గ్రూప్‌‌లుగా డివైడ్‌‌ అయ్యింది.  ఇందులో మొదటి టీమ్‌‌ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తుండగా, రెండో టీమ్‌‌ స్టాండ్‌‌ బైగా పనిచేస్తోంది.  ఆర్‌‌‌‌బీఐ డెట్‌‌, రిజర్వ్‌‌ మేనేజ్‌‌మెంట్ విభాగాలు కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇది చాలా కీలకం..

ఆర్‌‌‌‌బీఐ డేటా సెంటర్ అనేది క్రిటికల్ సిస్టమ్. ఇది పలు సెగ్మెంట్లలోని పేమెంట్స్‌‌ను ఆఫర్ చేస్తోంది. డేటా సెంటర్‌‌‌‌(డీసీ)లో కూడా ఐటీ, నాన్ ఐటీ సర్వీసులకు చెందిన సుమారు 600 మంది థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు పనిచేస్తున్నారు. వీరితో పాటు బ్యాంక్‌‌ల నుంచి 60 మంది అధికారులు డీసీ సెంటర్‌‌‌‌లో వర్క్ చేస్తున్నారు. ఈ ప్లాన్ ప్రకారం, ఆర్‌‌‌‌బీఐ టీమ్, హోటల్ స్టాఫ్‌‌ను విడదీశారు.   ఇతర డీసీల్లో కూడా ఆర్‌‌‌‌బీఐ ఇలాంటి అరేంజ్‌‌మెంట్స్‌‌నే చేసింది. దాదాపు అన్ని సర్వీసులు పనిచేసేలా చర్యలు తీసుకుంటోంది.   బిజినెస్ కంటింజెన్సీ ప్లాన్స్‌‌ను తీసుకురావాలని గత వారమే ఆర్‌‌‌‌బీఐ బ్యాంక్‌‌లను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు బ్యాంక్‌‌లు కూడా నడుచుకుంటున్నాయి. ‘ఎంత వీలైతే అంత కస్టమర్లు డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులనే వాడేలా  ప్రోత్సహిస్తున్నాం. వ్యాపారాలు, సామాజిక కోణంలో పరిస్థితిని ఎల్లప్పుడూ మానిటర్ చేస్తున్నాం. క్విక్ రెస్పాన్స్ టీమ్‌‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీలైనంత వరకు అన్ని సేవలూ అందిస్తాం’ అని ఆర్‌‌‌‌బీఐ చెప్పింది.

మార్కెట్లకు మరింత లిక్విడిటీ

  • రూ.30 వేల కోట్ల విలువైన బాండ్లు కొంటామన్న ఆర్‌‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ల కొనుగోలు ద్వారా మరో రూ.30 వేల కోట్లను మార్కెట్‌‌లోకి పంపిస్తోంది. కరోనాను తట్టుకునేందుకు ఆర్‌‌‌‌బీఐ ఈ మేరకు లిక్విడిటీ చర్యలను ప్రకటిస్తోంది. రెండు దఫాల్లో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా రెండు, ఐదు, ఆరు, తొమ్మిదేళ్ల సెక్యురిటీలను కొనుగోలు చేయాలని, ఇలా రూ.15 వేల కోట్ల చొప్పున మార్కెట్‌‌లోకి నగదు అందివ్వాలని నిర్ణయించినట్టు ఆర్‌‌‌‌బీఐ తెలిపింది. వీటి ఆక్షన్‌‌ను ఈ నెల 24న, 30న నిర్వహిస్తామని చెప్పింది.‘ఈ శుక్రవారం నిర్వహించిన ఓపెన్ మార్కెట్ పర్చేజ్ ఆక్షన్‌‌కు పాజిటివ్‌‌ స్పందన వచ్చింది. అదేవిధంగా కరోనా ఎఫెక్ట్‌‌తో కొన్ని ఫైనాన్షియల్ మార్కెట్ సెగ్మెంట్లలో పరిస్థితి దారుణంగా ఉంది. ఫైనాన్షియల్ కండిషన్స్‌‌ కూడా చాలా కఠినంగా ఉన్నాయి’ అని ఆర్‌‌‌‌బీఐ చెప్పింది. మార్కెట్‌‌లో నగదును పెంచడానికి, నగదు ఫ్లో కరెక్ట్‌‌గా ఉండేలా చేయడానికి తాము అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. పలు దఫాల్లో లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ కింద రూ.లక్ష కోట్లు, 200 కోట్ల డాలర్ల విలువైన రూపాయి–డాలర్ బై/సెల్‌‌ స్వాప్‌‌ను ఆర్‌‌‌‌బీఐ ప్రకటించింది. మార్కెట్ అంచనావేసిన మాదిరిగా వడ్డీరేట్లను తగ్గించినప్పటికీ, లిక్విడిటీ అందించే చర్యలు మాత్రం ఆర్‌‌‌‌బీఐ ప్రకటిస్తూనే ఉంది. వచ్చే నెలలో జరగబోయే మానిటరీ పాలసీ కమిటీలో రేటు కోత నిర్ణయాన్ని ప్రకటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.