ఆర్ఎఫ్ సీఎల్ యూరియా ఇంకా లేట్! ..రామగుండం ప్లాంట్లో తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లమ్ 37 రోజులుగా నిలిచిపోయిన యూరియా ఉత్పత్తి

ఆర్ఎఫ్ సీఎల్ యూరియా ఇంకా లేట్!  ..రామగుండం ప్లాంట్లో తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లమ్  37 రోజులుగా నిలిచిపోయిన యూరియా ఉత్పత్తి
  • ప్లాంట్ రన్ అయ్యేందుకు మరో పది రోజులు పట్టే చాన్స్ 
  • సాంకేతిక లోపాలతో ఖరీఫ్ సీజన్ లో పలుమార్లు షట్ డౌన్ 

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్​అండ్​ కెమికల్స్​లిమిటెడ్​(ఆర్ఎఫ్​సీఎల్​) ప్లాంట్ లో యూరియా తయారీ ఇంకా లేట్ అయ్యేలా ఉంది. గత ఆగస్టు14న ప్లాంట్​లోని హెచ్​టీఆర్​మెషీన్ లో  టెక్నికల్​ప్రాబ్లమ్ తలెత్తింది. 37 రోజులుగా రిపేర్లు చేస్తున్నా ఇంకా కంప్లీట్ కాలేదు. డెన్మార్క్​ నుంచి వచ్చిన టెక్నికల్ టీమ్ తో పాటు ఎల్​అండ్​టీ టీమ్ రిపేర్ చేస్తోంది. ప్లాంట్​రన్​ చేయడానికి ఇంకా పది రోజులు పట్టనున్నట్టు తెలుస్తోంది. 

2021, మార్చి 22న  ప్లాంట్ లో యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటివరకు 20 సార్లు టెక్నికల్ ప్రాబమ్స్ తలెత్తాయి. గత మే 8 నుంచి జూన్​15 వరకు 39 రోజులు, జులై 16 నుంచి ఆగస్టు 4 వరకు 20 రోజులు ప్లాంట్​షట్​డౌన్​అయింది. ప్రస్తుతం ప్లాంట్​లో అమ్మోనియా లీక్​కావడంతో షట్​డౌన్​చేశారు. గత ఆగస్టు 14  నుంచి 37 రోజులుగా ప్లాంట్​ షట్​ డౌన్​లోనే ఉంది.  

 హెచ్ టీఆర్ ​మెషీన్ ముంబైకి..  

ప్లాంట్​లో యూరియా ఉత్పత్తి ప్రక్రియలో సింథసిస్​గ్యాస్​ప్రొడ్యూస్​చేసేందుకు ఏర్పాటు చేసిన హీట్​ట్రాన్స్​ఫార్మింగ్​రీఫార్మర్(హెచ్ టీఆర్​)లో గత ఆగస్టు 14న టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. కంపెనీలో 11.70 శాతం వాటా కలిగిన డెన్మార్క్​కు చెందిన హల్దర్​టాప్స్​కంపెనీ హెచ్​టీఆర్​మెషీన్ ను ఏర్పాటు చేసింది. 

ప్లాంట్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ రాగానే  వెంటనే హల్దర్ కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందించగా వచ్చారు. ఎల్​అండ్​టీ సంస్థ అధికారులతో కలిసి రిపేర్లు చేపట్టారు. ప్లాంట్​లోని ఒక పార్ట్​ను రిపేర్​కోసం పది రోజుల కింద ప్రత్యేక ట్రక్​లో ముంబైకి తీసుకెళ్లారు. అది వచ్చిన తర్వాతే రిపేర్లు చేపట్టి ప్లాంట్​ను రన్​ చేసే చాన్స్ ఉంది.  

రబీ సీజన్​కైనా అందించేనా..?  

 ప్రస్తుతం ప్లాంట్​షట్​డౌన్​కారణంగా ఖరీఫ్ సీజన్ లో యూరియా ఉత్పత్తి చేయలేకపోయింది. జూన్​నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ప్లాంట్​షట్​డౌన్​అయింది. దీంతో సుమారు 4.24 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్ లో తయారయ్యే యూరియాలో తెలంగాణకే సగానికి పైగా కేటాయింపులు చేసేవారు. ఇప్పుడు యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంతో  కొరత ఏర్పడింది.  కాగా.. అక్టోబర్​నుంచి మొదలయ్యే రబీ సీజన్​కైనా యూరియా అందుతుందా ?  అనే సస్పెన్స్ నెలకొంది.  

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  దృష్టి పెట్టాలి

 ఇకముందైనా ప్లాంట్​నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్లాంట్​లో నిత్యం టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. మరోవైపు సెంట్రల్ ఆఫీసును నోయిడా నుంచి రామగుండం  తరలించాలనే డిమాండ్​వినిపిస్తోంది. ఇలా ఎందుకంటే.. ప్లాంట్ లో ఏదైనా సమస్య తలెత్తితే.. ఉన్నతాధికారు లు త్వరగా స్పందించేందుకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణకు యూరియాను అందించే ప్లాంట్​పై 11 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్​పెట్టాలి.