బెంగళూరు భళా.. ముంబాయి డీలా..

బెంగళూరు భళా.. ముంబాయి డీలా..
  • ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో బెంగళూరు బోణీ
  • ముంబైపై 2 వికెట్ల తేడాతో గెలుపు

లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ వరకు థ్రిల్లింగ్‌‌‌‌గా సాగిన ఐపీఎల్‌‌‌‌–14 స్టార్టింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో బెంగళూరు బోణీ కొట్టింది..! లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో 7 రన్స్‌‌‌‌ చేయాల్సిన దశలో డివిలియర్స్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48) అనూహ్యంగా రనౌటైనా... లాస్ట్‌‌‌‌ రెండు బాల్స్‌‌‌‌కు రెండు రన్స్‌‌‌‌ చేయాల్సిన దశలో లెగ్​ బైతో ఉత్కంఠ రేగినా.. ఆఖరి బాల్‌‌‌‌కు హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ ఓ రన్‌‌‌‌ చేయడంతో ఆర్‌‌‌‌సీబీ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది..! ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో ఎప్పుడూ గెలవని చరిత్రను కొనసాగించిన ముంబై.. బ్యాటింగ్‌‌‌‌ వైఫల్యంతో భారీ టార్గెట్‌‌‌‌ను నిర్దేశించలేకపోయింది..! హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ (5/27) దెబ్బకు కుదేలైన ముంబైలో క్రిస్‌‌‌‌ లిన్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49) పోరాటం చేశాడు..!!

చెన్నై: ఐపీఎల్‌‌‌‌లో ఇప్పటివరకు ఐదుసార్లు ట్రోఫీలు నెగ్గినా.. ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ గెలవడంలో మాత్రం ముంబై ఎప్పుడూ తడబడుతూనే ఉంది. తాజాగా ఐపీఎల్‌‌‌‌–14లోనూ అదే సీన్‌‌‌‌ రిపీట్‌‌‌‌ అయ్యింది. దీంతో శుక్రవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. ఓవరాల్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌లో ముంబై ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఓడటం ఇది వరుసగా తొమ్మిదోసారి. ముందుగా ముంబై ఇండియన్స్‌‌‌‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 రన్స్‌‌‌‌ చేసింది. క్రిస్‌‌‌‌ లిన్‌‌‌‌తో పాటు సూర్యకుమార్‌‌‌‌ (23 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 31), ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (19 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 28) రాణించారు. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 రన్స్‌‌‌‌ చేసింది. డివిలియర్స్‌‌‌‌తో పాటు మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), కోహ్లీ (29 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లతో 33) చెలరేగారు. హర్షల్​కు ‘మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

లిన్‌‌‌‌ జోరు.. హర్షల్‌‌‌‌ పాంచ్‌‌‌‌
టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ముంబైకి మెరుపు ఆరంభం లభించలేదు. సిరాజ్‌‌‌‌, జెమీసన్‌‌‌‌ (1/27) కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో తొలి మూడు ఓవర్లలో 6 రన్స్‌‌‌‌ వచ్చాయి. ఇందులో ఓ ఫోర్‌‌‌‌ కొట్టిన రోహిత్‌‌‌‌ (19).. చహల్‌‌‌‌ (4వ ఓవర్‌‌‌‌) బౌలింగ్‌‌‌‌లో రనౌటయ్యాడు. ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 24 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఇదే ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌, సిక్స్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి వచ్చిన క్రిస్‌‌‌‌ లిన్‌‌‌‌.. ఆరో ఓవర్‌‌‌‌లో రెండో సిక్సర్‌‌‌‌ బాదాడు. సూర్యకుమార్‌‌‌‌ కూడా తోడుకావడంతో పవర్‌‌‌‌ప్లేలో ముంబై 41/1 స్కోరు చేసింది. ఛేంజ్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా వచ్చిన షాబాజ్‌‌‌‌కు 4, 6తో స్వాగతం పలికిన లిన్‌‌‌‌.. హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ బాల్‌‌‌‌ను కూడా స్టాండ్స్‌‌‌‌లోకి పంపాడు. మధ్యలో సూర్య రెండు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఓవరాల్‌‌‌‌గా తొలి 10 ఓవర్లలో ముంబై స్కోరు 86/1కి పెరిగింది. 11వ ఓవర్‌‌‌‌లో తన ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ సిక్సర్‌‌‌‌ కొట్టిన సూర్య.. లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు ఔటయ్యాడు. ఫలితంగా సెకండ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 70 రన్స్​ భాగస్వామ్యం ముగిసింది. మంచి జోరుమీదున్న లిన్‌‌‌‌ను 13వ ఓవర్‌‌‌‌లో సుందర్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌కు పంపాడు. దీంతో ముంబై స్కోరు 105/3కి చేరింది. ఈ దశలో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ 6, 4తో రెచ్చిపోయినా, హార్దిక్‌‌‌‌ పాండ్యా (13)ను హర్షల్‌‌‌‌ బోల్తా కొట్టించడంతో ముంబై 16 ఓవర్లలో 4 వికెట్లకు 135 రన్స్‌‌‌‌ చేసింది. ఇక భారీ షాట్లు ఆడతాడనుకున్న పొలార్డ్‌‌‌‌ (7) ఘోరంగా విఫలమయ్యాడు. హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో 28 రన్స్‌‌‌‌ వద్ద కిషన్‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను డీప్‌‌‌‌ స్క్వేర్‌‌‌‌ వద్ద సిరాజ్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ చేశాడు. కానీ ఆ వెంటనే వేసిన డెడ్లీ యార్కర్‌‌‌‌కు కిషన్‌‌‌‌ వెనుదిరగక తప్పలేదు. 19వ ఓవర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు క్రునాల్‌‌‌‌ (7) ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను మిడాఫ్‌‌‌‌లో కోహ్లీ వదిలేసినా.. పొలార్డ్‌‌‌‌తో కలిసి వేగంగా సింగిల్స్‌‌‌‌ తీశాడు.  ఈ ఓవర్‌‌‌‌లో 12 రన్స్‌‌‌‌ వచ్చాయి. కానీ లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌ చేశాడు. నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో క్రునాల్‌‌‌‌, పొలార్డ్‌‌‌‌, మార్కో జెన్‌‌‌‌సెన్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేశాడు. చహర్‌‌‌‌ (0) రనౌట్‌‌‌‌ అయ్యాడు.  

ముగ్గురు ఆడారు..
మోస్తరు టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో బెంగళూరుకు సరైన స్టార్టింగ్‌‌‌‌ దొరకలేదు. సెకండ్‌‌‌‌ బాల్‌‌‌‌కే క్యాచ్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ నుంచి బయటపడ్డ సుందర్‌‌‌‌ (10) నిలకడ చూపలేకపోయాడు. అయితే రెండో ఎండ్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ కోహ్లీ మాత్రం సాధికారిక ఇన్నింగ్స్‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా స్ట్రయిక్‌‌‌‌ తీసుకుని వీలైనప్పుడల్లా బౌండరీలు రాబట్టాడు. ఐదో ఓవర్‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన క్రునాల్‌‌‌‌ (1/25)... సుందర్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయగా, రజత్‌‌‌‌ పటిదార్‌‌‌‌ (8) క్రీజులోకి వచ్చాడు. అయినా బౌల్ట్‌‌‌‌ దెబ్బకు ఆరో ఓవర్‌‌‌‌లో క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. పవర్‌‌‌‌ప్లేలో ఆర్‌‌‌‌సీబీ స్కోరు 46/2. నాలుగో ప్లేస్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌  సమయోచితంగా ఆడాడు. చహర్‌‌‌‌ వేసిన 8వ ఓవర్‌‌‌‌లో రెండు ఫోర్లతో 13 రన్స్‌‌‌‌ రాబట్టాడు. తర్వాత మరో బౌండ్రీ సాధించడంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో ఆర్‌‌‌‌సీబీ 75/2 స్కోరు చేసింది. రన్‌‌‌‌రేట్‌‌‌‌ ఓవర్‌‌‌‌కు ఎనిమిది రన్స్‌‌‌‌కు పెరగడంతో మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ గేర్‌‌‌‌ మార్చాడు. 11వ ఓవర్‌‌‌‌ (క్రునాల్‌‌‌‌) ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ను స్టాండ్స్‌‌‌‌లోకి పంపిన అతను... తర్వాతి ఓవర్‌‌‌‌ (చహర్‌‌‌‌) తొలి బాల్‌‌‌‌ను స్టాన్స్‌‌‌‌ మార్చి రివర్స్‌‌‌‌ స్వీప్‌‌‌‌ సిక్సర్‌‌‌‌ కొట్టాడు. ఈ రెండు ఓవర్లలో 20 రన్స్‌‌‌‌ వచ్చాయి. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌‌‌‌కు బుమ్రా ఝలక్‌‌‌‌ ఇచ్చాడు. సెకండ్‌‌‌‌ స్పెల్‌‌‌‌కు దిగిన వెంటనే కోహ్లీని ఔట్‌‌‌‌ చేయడంతో థర్డ్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 52 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయ్యింది. 15వ ఓవర్‌‌‌‌లో మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌తో పాటు షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (1) ఔట్‌‌‌‌కావడంతో ఆర్‌‌‌‌సీబీ 106/5తో కష్టాల్లో పడింది. 16వ ఓవర్‌‌‌‌లో డివిలియర్స్‌‌‌‌ 4, 6తో 15 రన్స్‌‌‌‌ రాబట్టడంతో విక్టరీ ఈక్వేషన్‌‌‌‌ 24 బాల్స్‌‌‌‌లో 39 రన్స్‌‌‌‌గా మారింది. 17వ ఓవర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌కు దిగిన బుమ్రా.. 5 రన్స్‌‌‌‌ మాత్రమే ఇచ్చిన క్రిస్టియన్‌‌‌‌ (1)ను ఔట్‌‌‌‌ చేశాడు. ఇక 18 బాల్స్‌‌‌‌లో 34 రన్స్‌‌‌‌ అవసరమైన దశలో డివిలియర్స్‌‌‌‌ 6, 4, 4, 4 దంచడంతో విజయసమీకరణం 6 బాల్స్‌‌‌‌లో 7 రన్స్‌‌‌‌గా మారింది. 

స్కోరు బోర్డు
ముంబై ఇండియన్స్‌‌‌‌: రోహిత్‌‌‌‌ (రనౌట్‌‌‌‌) 19, క్రిస్‌‌‌‌ లిన్‌‌‌‌ (సి అండ్‌‌‌‌ బి) సుందర్‌‌‌‌ 49, సూర్యకుమార్‌‌‌‌ (సి) డివిలియర్స్‌‌‌‌ (బి) జెమీసన్‌‌‌‌ 31, ఇషాన్‌‌‌‌ (ఎల్బీ) పటేల్‌‌‌‌ 28, హార్దిక్‌‌‌‌ (ఎల్బీ) పటేల్‌‌‌‌ 13, పొలార్డ్‌‌‌‌ (సి) సుందర్‌‌‌‌ (బి) పటేల్‌‌‌‌ 7, క్రునాల్‌‌‌‌ (సి) క్రిస్టియన్‌‌‌‌ (బి) పటేల్‌‌‌‌ 7, మార్కో జెన్‌‌‌‌సెన్‌‌‌‌ (బి) పటేల్‌‌‌‌ 0, రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ (రనౌట్‌‌‌‌) 0, బుమ్రా (నాటౌట్‌‌‌‌) 1, ఎక్స్‌‌‌‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 159/9. వికెట్లపతనం: 1–24, 2–94, 3–105, 4–135, 5–145, 6–158, 7–158, 8–158, 9–159. బౌలింగ్‌‌‌‌: సిరాజ్‌‌‌‌ 4–0–22–0, జెమీసన్‌‌‌‌ 4–0–27–1, చహల్‌‌‌‌ 4–0–41–0, షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ 1–0–14–0, హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌ 4–0–27–5, క్రిస్టియన్‌‌‌‌ 2–0–21–0, 
సుందర్‌‌‌‌ 1–0–7–1. 
రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరు: సుందర్‌‌‌‌ (సి) లిన్‌‌‌‌ (బి) క్రునాల్‌‌‌‌ 10, కోహ్లీ (ఎల్బీ) బుమ్రా 33, రజత్‌‌‌‌ పటిదార్‌‌‌‌ (బి) బౌల్ట్‌‌‌‌ 8, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (సి) లిన్‌‌‌‌ (బి) జెన్‌‌‌‌సెన్‌‌‌‌ 39, డివిలియర్స్‌‌‌‌(రనౌట్‌‌‌‌) 48 , అహ్మద్‌‌‌‌ (సి) క్రునాల్‌‌‌‌ (బి) జెన్‌‌‌‌సెన్‌‌‌‌ 1, క్రిస్టియన్‌‌‌‌ (సి) చహర్‌‌‌‌ (బి) బుమ్రా 1, జెమీసన్‌‌‌‌ (రనౌట్‌‌‌‌) 4, హర్షల్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 4, సిరాజ్‌‌‌‌ (నాటౌట్‌‌‌‌) 0, ఎక్స్‌‌‌‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 160/8. వికెట్లపతనం: 1–36, 2–46, 3–98, 4–103, 5–106, 6–122, 7–152, 8–158. బౌలింగ్‌‌‌‌: బౌల్ట్‌‌‌‌4–0–36–1, బుమ్రా 4–0–26–2, జెన్‌‌‌‌సెన్‌‌‌‌ 4–0–28–2, క్రునాల్‌‌‌‌ 4–0–25–1, రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ 4–0–43–0.