
బెంగళూరు: స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత టైమ్‌కు ఆర్‌సీబీ తన ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. ఈ సీజన్‌లో ఇదే తొలి తప్పిదం కావడంతో కేవలం ఫైన్‌తో సరిపెట్టారు. ఇక ఉత్కంఠభరిత పోరులో నెగ్గిన తర్వాత లక్నో బ్యాటర్ అవేశ్ ఖాన్ హెల్మెట్‌ను నేలకేసి కొట్టడంతో రిఫరీ తీవ్రంగా మందలించాడు. రూల్స్ ప్రకారం బ్యాటర్ ఏ పరిస్థితుల్లోనూ హెల్మెట్‌ను కింద పడేయకూడదు.