IPL 2024: ధోనీ కాదు.. మాకు 'తలా' అంటే అతడే: ఆర్సీబీ ఫ్యాన్స్

IPL 2024: ధోనీ కాదు.. మాకు 'తలా' అంటే అతడే: ఆర్సీబీ ఫ్యాన్స్

తలా.. క్రికెట్ లో ఈ  పదం వింటే ఠక్కున గుర్తుకొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. 2008 నుంచి 2023 వరకు చెన్నై జట్టును విజయవంతంగా నడిపిన ధోనీని అభిమానులు అతనికి తలా అనే బిరుదును కట్టబెట్టారు. ఈ ఐకానిక్ పేరు మాహీకి  పర్యాయపదంగా మారింది. అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం దీనిని ఒప్పుకోవడం లేదు. తలా అనే పదం ఆర్సీబీ జట్టులోని దినేష్ కార్తీక్ కు చెందుతుందని.. అతనే అసలైన తలా అని స్టేడియంలో బెంగళూరు వికెట్ కీపర్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

also read : ఐపీఎల్ టికెట్లు ఆన్ లైన్లో బుక్ చేస్తున్నారా? జాగ్రత్త

నిన్న (మార్చి 29) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ తనదైన ఫినిషింగ్ తో ఆర్సీబీ జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 8 బంతుల్లోనే 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి ఈ సీజన్ లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కార్తీక్ క్విక్‌ఫైర్ క్యామియో ఆడడంతో స్టేడియం హోరెత్తింది. RCB అభిమానులు చప్పట్లు కొడుతుండగా.. ఒక అభిమాని స్టాండ్స్‌లో 'డీకే ఈజ్ ది రియల్ తలా' అనే ప్లకార్డ్‌ను పట్టుకుని గంతులేస్తున్నాడు. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సీజన్ లో దినేష్ కార్తీక్ తన టాప్ ఫామ్ ను చూపిస్తున్నాడు. జట్టు గెలుపోటములను పక్కన పెడితే ఈ వెటరన్ ప్లేయర్ మాత్రం పరుగుల వరద పారిస్తున్నాడు. చెన్నైపై జరిగిన తొలి మ్యాచ్ లో జట్టు 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో 26 బంతుల్లో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో కేవలం 10 బంతుల్లోనే 28 పరుగులు చేసి ఆర్సీబీకు విజయాన్ని అందించాడు. ఇక నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ 8 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు.